Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై బిడ్డపుట్టాక ప్రేమలో పడిన మహిళ: ప్రియుడితో జంప్.. మళ్లీ భర్త వద్దకు ఎందుకొచ్చింది?

భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకి ప్రధానకారణం వివాహేతర సంబంధాలు. డబ్బున్న కుటుంబాలలో విడాకులకి, పేద కుటుంబాల్లో హత్యలకి చాలావరకు అక్రమసంబంధాలే కారణం అవుతుంటాయి. ఇలాంటి సంబంధాలు, ఆ సంబంధం పెట్టుకున్నవారి

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (15:10 IST)
భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకి ప్రధానకారణం వివాహేతర సంబంధాలు. డబ్బున్న కుటుంబాలలో విడాకులకి, పేద కుటుంబాల్లో హత్యలకి చాలావరకు అక్రమసంబంధాలే కారణం అవుతుంటాయి. ఇలాంటి సంబంధాలు, ఆ సంబంధం పెట్టుకున్నవారి పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా ఓ భార్య... భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో లేచిపోయింది. 
 
కొన్ని రోజుల తర్వాత ఆ ప్రియుడు టాటా బై బై చెప్పడంతో తిరిగి భర్త చెంతకు చేరుకుంది. తిరిగి రావడమే కాకుండా తనతో కాపురం చేయకపోతే డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే తనను వదిలి వెళ్లిన భార్యను తిరిగి స్వీకరించేది లేదని భర్త తేల్చిచెప్పేశాడు. పూర్తి వివరాల మేరకు... రశ్మి అలియాస్ లక్ష్మి, ఆమె భర్త శశిలు తమ పిల్లలతో కలిసి మండ్యలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో రశ్మికి ఎదురింట్లో నివాసమున్న సాగర్‌‌తో పరిచయం ఏర్పడింది. 
 
ప్రేమ ఎప్పుడు ఏ టైంలో పుడుతుందో చెప్పడం కష్టం కదా... ఆ ప్రేమే వివాహేతర సంబంధానికి పునాదిగా మారింది. సాగర్‌పై ఉన్న మోజుతో భర్తను వదిలేసి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. దీంతో భార్య,భర్తల మధ్య తరుచూ గొడవలు మొదలయ్యాయి. ఈ విషయం కాస్తా శశి బంధువులకు తెలియడంతో... సాగర్‌కు దేహశుద్ధి చేశారు. ఆ నోటా ఈ నోటా ఈ గుట్టు పోలీస్ స్టేషన్‌కు చేరింది.
 
పోలీసుల విచారణలో... తనకు భర్త శశితో ఉండడం ఇష్టం లేదని సాగర్‌ను పెళ్లి చేసుకొని అతనితోనే కాపురం చేస్తానని రశ్మి చెప్పడంతో శశి కూడా చేసేది లేక ఒప్పుకున్నాడు. ఇకపై రశ్మికి, తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ఇది జరిగిన కొద్ది రోజులు గడువక ముందే రశ్మి ప్రేమికుడు ఆమెకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయాడు. దీంతో రశ్మికి దిక్కుతోచక తిరిగి భర్త వద్దకే చేరుకుంది. ఇకపై భర్తతోనే ఉంటానని, అందుకు ఒప్పుకోకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని ఇంటి ముందు తిష్టవేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments