Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషాహారం తిని డీఎంకే నేత కుటుంబంతో ఆత్మహత్య.. కొడుకును హీరోగా సినిమా తీసి..?

విషాహారం తీసుకుని డీఎంకే నేత కుటుంబంతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు, విల్లుపురం జిల్లా, దిండివనం సమీపంలో వున్న పురంగరై గ్రామంల చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (14:56 IST)
విషాహారం తీసుకుని డీఎంకే నేత కుటుంబంతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు, విల్లుపురం జిల్లా, దిండివనం సమీపంలో వున్న పురంగరై గ్రామంల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పురంగరై గ్రామానికి చెందిన డీఎంకే నేత పొన్‌కుమార్ (45) జూన్ 16వ తేదీ రాత్రి తన భార్య సుమతి, కుమారుడు దీన, కుమార్తె షణ్ముగ ప్రియలతో కలిసి విషాహారం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. 
 
కుటుంబంతో పాటు పొన్‌కుమార్ ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏమిటా అని పోలీసులు ఆరా తీయడం ద్వాలా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడిని హీరోగా పెట్టి సినిమా తీసిన కారణంగా ఆ నష్టాలను పూడ్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. 
 
పొన్‌కుమార్ నిర్మించిన ‘కాదల్‌ జననం’ అనే చిత్రంలో ఆయన కుమారుడు దీన హీరోగా నటించారని, అయితే ఈ సినిమా విడుదలకు నోచుకోకపోవడంతో కలిగిన భారీ నష్టంతో మనస్తాపం చెందిన తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.  
 
పొన్‌కుమార్ కుమారుడు దీన విజువల్ కమ్యూనికేషన్ చదివాడని, సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపేవాడని.. అందుకే తండ్రి నిర్మాణంలో సినిమా తీశాడని.. కానీ కాదల్ జననం సినిమాలో రెండో కథానాయకుడిగా దినా నటించాడు. ఆ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. దీంతో భారీగా కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం వెచ్చించిన పొన్‌కుమార్ నష్టాలను పూడ్చలేక మనస్తాపంతో కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments