Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ: పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి!

మెక్సికోలో విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో, ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (14:48 IST)
మెక్సికోలో విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో, ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. దీంతో పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకారులపై కాల్పుల వర్షాన్ని కురిపించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మంది మృతి చెందగా... అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో మరింత ఆగ్రహించిన ఆందోళనకారులు.. వాహనాలను చిత్తు చిత్తు చేశారు. 
 
తద్వారా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కేసుల్లో అరెస్ట్ చేసిన టీచర్ల సంఘం నేతలను విడుదల చేయాలని కోరుతూ నిరసనలు జరుగుతున్నాయి. మరోపక్క పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలంటే పోటీ పరీక్ష రాయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నియమాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తూ నిరసనకు దిగారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంభవంతో మెక్సికో పరిసరప్రాంతాలు రక్తభూమిని తలపిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments