Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొద్దింకలంటే భార్యకు భయం.. 18సార్లు ఇల్లు మారాను.. ఇక వేగలేను.. విడాకులు ఇప్పించండి..

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:21 IST)
భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లైన కొన్ని రోజులకు భార్య వంటగదిలో పెద్ద పెద్దగా గా కేకలు పెట్టింది. దీంతో ఇంట్లో ఏదో పనిలో ఉన్న భర్త హడలిపోయాడు. పరుగు పరుగున వెళ్లి చూశాడు. ఏమిటా అని ఆరా తీస్తే.. ఓరి  నాయనోయ్.. బొద్దింక.. బొద్దింక.. బొద్దింక..అంటూ కళ్ళు పెద్దవి చేసి వణికిపోతూ కనిపించింది. నిలబడిన స్థలం నుంచి ఒక్క అడుగు కూడా కదలకుండా వణికిపోతూ నిలబడిపోయింది. బాబోయ్.. వంటగదిలో బొద్దింకలున్నాయి.. నేను ఛస్తే కిచెన్ లోకి వెళ్లనని తేల్చి చెప్పేసింది. వేరే ఇల్లు మారదామని పట్టుబట్టింది.
 
అలా మరో ఇంటికి మారారు. అక్కడ కూడా ఇదే సమస్య. మళ్లీ ఇంకో ఇంటికి మారారు. అక్కడ కూడా అదే సమస్య రిపీట్ కావటంతో మరోఇల్లు. ఇలా కేవలం మూడు సంవత్సరాలలో 18 ఇళ్లు మారే వరకు కొనసాగింది. భర్తకు ఇదో పెద్ద సమస్యగా మారింది. ఆఫీసులో కొలీగ్స్ అతనని హేళ చేయడం మొదలెట్టారు. దీంతో అతనికి భార్య భయంపై అసహనం పెరిగిపోయింది.
 
వెంటనే సైకాలజిస్టుల దగ్గరకు తీసుకెళ్లాడు. కౌన్సెలింగ్ ఇప్పించాడు. కానీ అదే సమస్య మళ్లీ మళ్లీ రావటంతో మరో సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు. దీంతో ఆ భార్య భర్తపై మండిపడింది. ఆవేదన చెందింది. దీంతో ఆ భర్తకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎంతగా చెప్పినా… ఎంతమందితో చెప్పించినా… భార్యకు బొద్దింకల భయం పోవటంలేదు. దీంతో విసిగిపోయిన భర్త చేసేది లేక ''ఈ బొద్దింకల భయం భార్యతో నేనిక వేగలేను.. నా విడాకులు కావాలంటున్నాడు. 
 
బొద్దింకలంటే నా భార్యకు ఎంత భయమంటే.. గట్టిగా అరుస్తూ ఇంట్లో సామాన్లను బయటకు విసిరేస్తోంది. ఇక నాకు ఆమెను భరించే ఓపిక లేదు. అందుకే విడాకులకు అప్లై చేశానని చెబుతున్నాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఈ వ్యక్తి ప్రస్తుతం భార్యకు దూరం కావాలనుకుంటున్నాడు. ఈ జంటకు 2017లో వివాహం జరిగింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments