Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు టీలో విషమిచ్చి ప్రియుడితో భార్య జంప్: హత్య యత్నం చేసినా తనకు తన భార్య కావాలంటున్న భర్త

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (18:32 IST)
ప్రియుడి ముసుగులో పడి భర్తను భార్య చంపేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. అలాగే ప్రియురాళ్ళ ముసుగులో పడి భార్యను చంపేస్తున్న భర్తలను చూసే ఉంటాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రియుడిని గాఢంగా ప్రేమిస్తున్న తన భార్య అతనితోను, తనతోను కలిసి ఉండవచ్చని భర్త చెప్పడం. బంధువులు, సొంతవారు వారిస్తున్నా పట్టించుకోలేదు ఆ భర్త. చివరకు భార్య కారణంగా ఆసుపత్రిపాలయ్యాడు ఓ భర్త.

 
ఛతర్ పూర్ జిల్లాలోని లవ్‌కుష్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసముంటున్నారు సంతోష్, సుధ. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. సుధకు 35 ఏళ్లు. గత ఆరు నెలల నుంచి సుధ, ప్రమోద్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ప్రమోద్, సుధ కొడుక్కి ట్యూషన్ చెప్పేందుకు వచ్చిన టీచర్.

 
ప్రమోద్‌కు పెళ్ళి కూడా కాలేదు. సుధ అతనికి కనెక్టయ్యింది. భర్త కంటే ప్రియుడితోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉండటం మొదలుపెట్టింది సుధ. అయితే ఈ విషయం భర్తకు తెలిసింది. ఏ భర్త అయినా భార్యను కానీ లేదంటే ప్రియుడి పైన దాడి చేయడం.. లేకుంటే తనే ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేసేవారిని చూసాం.
 
కానీ ఇక్కడ సంతోష్ మాత్రం తన భార్య ప్రియుడితో ఉన్నా ఫర్వాలేదు, కానీ నా బిడ్డను నన్ను వదిలివెళ్ళకుండా ఉంటే మాత్రం చాలనుకున్నాడు. రెండురోజుల క్రితం ప్రియుడితో కలిసి వెళ్ళిపోయేందుకు సిద్ధమైన సుధ, భర్తను చంపేద్దామనుకుంది. 

 
అడ్డంకిగా ఉన్న భర్తను చంపేందుకు టీలో విషం కలిపి ఇచ్చింది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న సంతోష్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య ప్రియుడితో పరారైంది. పోలీసుల విచారణలో భార్యదే కీలక పాత్రగా భావించి కేసు నమోదుకు సంతోష్‌ను అడిగారు. అయితే తన భార్య చేసింది తప్పు కాదని.. ఇప్పటికీ తన భార్య ఇక్కడకు వస్తే తాను ఇంటికి తీసుకెళతానంటున్నాడు సంతోష్. 

 
సంతోష్ మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం సుధ పరారీలో వుండగా ఈ విషయం కాస్త పెద్ద చర్చకే దారితీస్తోందట. కానీ సంతోష్ బంధువులు మాత్రం సుధను ఇక వదిలేసి ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments