Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవలు.. భర్త నాలుకను కొరికేసిన భార్య.. అంత కోపమెందుకో?

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (16:16 IST)
భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. అయితే ప్రస్తుతం చాలామందిలో ఓపిక నశించింది. దీంతో చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న గొడవలను మరిచిపోయి.. సాఫీగా సంసారం చేసుకునే దంపతులు రోజు రోజుకీ తగ్గిపోతుంది. తాజాగా ఓ భార్య పుట్టింటి నుంచి మెట్టింటికి రమ్మని భర్త చెప్పిన పాపానికి అతడి నాలుకను కరకరా కొరికేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని లఖ్‌నవూ జిల్లాకు చెందిన మున్నా, సల్మా దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే వీరికి తరచూ ఏదో గొడవ జరుగుతుండేది. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను.. ఇంటికి తీసుకొచ్చేందుకు సల్మా అత్తారింటికి వెళ్లాడు. ఇకపై గొడవపడనని చెప్పాడు. తన వెంట రావాలని కోరాడు. కానీ భార్య నిరాకరించింది. దీంతో మళ్లీ గొడవ మొదలైంది. 
 
అయితే పిల్లల్ని తనతో తీసుకు వెళ్లేందుకు మున్నా సిద్ధమయ్యాడు. అంతే కోపంతో ఊగిపోయిన సల్మా.. మున్నా నాలుకను తెగేలా కొరికేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన మున్నా స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments