Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్.. ఎక్కడ?

Advertiesment
gang rape
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఇద్దరు మైనర్ బాలుళ్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. పైగా, విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా పొరిగింటి అబ్బాయిలే కావడం గమనార్హం. 
 
అయితే, ఆ కామాంధులు బెదిరింపులు శృతిమించిపోవడంతో తొమ్మిదేళ్ల బాలిక తల్లికి విషయం చెప్పింది. దీంతో బాధిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికను వైద్య వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న పొరిగింట్లో ఉన్న ఇద్దరు బాలురు ఇంట్లోకి చొరబడి బాలికను వేధించి అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన మైనర్లు ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బాలికను బెదిరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - దావోస్‌లో మంత్రి కేటీఆర్