Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు దోమలు కుడుతున్నాయని పోలీసులకు భర్త ఫిర్యాదు.. మస్కిటో కాయిల్స్ పంపించిన ఖాకీలు..

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (10:00 IST)
కట్టుకున్న భార్యకు దోమలు కుట్టడాన్ని చూసి కట్టుకున్న భర్త చలించిపోయాడు. ఆమె పరిస్థితిని చూసి తట్టుకోలేక పోయాడు. ఆమె సమస్యకు ఏదో రూపంలో పరిష్కారం కనుగొనాలను భావించాడు. అంతే.. సోషల్ మీడియా వేదికగా పోలీసులకు సమాచారం చేరవేశాడు. తన భార్యకు దోమలు కుడుతున్నాయని సాయం చేయాలని కోరాడు. అతని కోరికపై పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. మస్కిటో కాయిల్స్ తెచ్చి ఇచ్చారు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని చాంద్‌‍దౌసీ ప్రాంతానికి చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్య ఇటీవలే ఆస్పత్రిలో ప్రసవించింది. అయితే, అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉండటంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. ఒకవైపు బాలింత నొప్పులు, మరోవైపు దోమల బెడతతో ఆమె ఇబ్బంది పడసాగింది. భార్య పరిస్థితి చూసిన భర్త తీవ్రంగా కలత చెందాడు. పైగా, అర్థరాత్రి 2.45 గంటల సమయం కావడంతో ఏం చేయాలో తోచక సోషల్ మీడియా వేదికగా పోలీసులను ఆశ్రయించాడు. "నా భార్య తీవ్ర ఇబ్బందికి గురవుతుంది. ఓవైపు నొప్పులు మరోవైపు దోమల బెడద. ఆమె బాధను చూడలేకుండా ఉన్నాను. దయచేసి మార్టిన్ మస్కిటో కాయిల్స్‌ను ఇప్పించండి" అంటూ ట్వీట్ చేశాడు. 
 
ఈ సందేశాన్ని చూసిన పోలీసులు... ఏమనుకున్నారోగానీ... నిమిషాల వ్యవధిలో మస్కిటో కాయిల్‌తో ఆస్పత్రికి వచ్చేశారు. పోలీసు ఉన్నతాధికారు నుంచి ఆదేశాలు అందడంతో వారు ఆస్పత్రికి మస్కిటో కాయిల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. పైగా నిమిషాల వ్యవధిలో సమస్యను పరిష్కరించిన పోలీసులకు అసద్ ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments