కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

సెల్వి
శుక్రవారం, 31 అక్టోబరు 2025 (09:52 IST)
Mysuru Crime
వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తలను హతమార్చడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. అయితే తాజాగా ఓ యువతి కాపురంలో కలహాలు వస్తున్నాయని, భర్తతో తగాదాలు పెరిగిపోతున్నాయనే కోపం ఆవేశంతో భర్తను హతమార్చడానికి ప్లాన్ చేసింది. కానీ భర్త అదృష్టం బాగుండి భార్య వేసిన స్కెచ్ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మైసూర్ జిల్లాలోని నంజన్‌గూడ్ పట్టణంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నంజన్‌గూడ్‌కు చెందిన రాజేంద్ర, అతని భార్య సంగీత కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ఇద్దరి మధ్య కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. ఇక లాభం లేదనుకుని భర్తను సంగీత చంపేయాలనుకుంది. ఇందుకోసం సోదరుడు, స్నేహితుల సాయం తీసుకుంది. ఇద్దరూ బైకుపై వెళ్తుండగా ఓ ముఠా వారి వద్ద గొడవ చేసింది. 
 
ఆపై వివాదం ముదిరే సమయంలో వారు పదునైన ఆయుధంతో రాజేంద్రను పొడిచారు. రాజేంద్ర కేకలు వేయడం, అదే సమయంలో అటు వైపు వాహనాలు వస్తుండడంతో వారిని వదిలి నిందితులు పరారయ్యారు. 
 
ఈ ఘటనలో రాజేంద్ర తీవ్రంగా గాయపడటంతో అతన్ని మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నంజన్‌గూడ్ పోలీసులు దర్యాప్తులో భార్యే ఈ నేరానికి కారణమని తేల్చారు. సినీ ఫక్కీలో పక్కాగా స్కెచ్ వేసి భర్తను చంపేయాలని సంగీత భావించింది. కానీ ప్రస్తుతం చిప్పకూడు తింటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments