Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ టీకా ఎన్నాళ్లు పనిచేస్తుంది?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (12:45 IST)
ప్రపంచాన్ని వణికించిన కరోనాకు పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. భారత్‌లో కూడా ఈనెల 16 నుండి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. మరి ఎన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఏ టీకా ఎంతకాలం పనిచేస్తుంది. ఎంతకాలం యాంటీబాడీలు శరీరంలో ఉంటాయి.. వాటి వివరాలు ..
 
మోడెర్నా
కరోనా విజృంభిస్తున్న సమయంలోనే తాము వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నామని ప్రకటించింది మోడెర్నా సంస్థ. ఈ ఔషధ కంపెనీ అభివృద్ధి పరిచిన ఎంఆర్‌ఎన్‌ఎతో కరోనాను అడ్డుకోవచ్చని ప్రజలకు ధైర్యం కలిగించింది. మా టీకాతో శరీరంలో యాంటీబాడీలు వేగంగా ఉత్పత్తి అవుతాయని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ స్టీఫాన్‌ బాన్సెల్‌ ప్రకటించారు. ఇవి నెమ్మదిగా క్షీణిస్తున్నాయని అన్నారు. ఈ యాంటీబాడీలు కనీసం రెండేళ్లు కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందని వెల్లడించారు.
 
కొవాగ్జిన్‌
భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ మూడోదశ ప్రయోగాలు పూర్తి కాకుండానే ప్రభుత్వం అత్యవసర అనుమతి పొందింది. ఈ టీకాతో మనిషి శరీరంలో యాంటీబాడీలు ఆరునెలల నుండి ఏడాది పాటు ఉంటాయని ప్రకటించింది. డిసిజిఐ కూడా ఈ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది.
 
కొవిషీల్డ్‌
ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెన్‌కాలు సంయుక్తంగా రూపొందించిన ఈ టీకాను భారత్‌లో సీరమ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా అత్యవసర వినియోగానికి డిజిజిఐ అనుమతించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ముఖ్య పరిశోధకురాలు, ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ మాట్లాడుతూ.. ప్రాథమికంగా కొందరిపై పరీక్షలు నిర్వహించాం. ఆ ఫలితాల ప్రకారం ఈ టీకా రెండు డోసులతో కరోనాకు కొన్నేళ్ల పాటు చెక్‌పెట్టవచ్చని అన్నారు. మనిషి శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే రోగనిరోధక శక్తి కన్నా ఈ టీకా ఎన్నోరెట్లు ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు.
 
ఫైజర్‌
అత్యవసర వినియోగం కింద బ్రిటన్‌లో అనుమతి పొందిన తొలి టీకా ఫైజర్‌. అనంతరం అమెరికా, ఇతర దేశాల్లోనూ అనుమతించారు. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వాడిన 85 రోజుల తర్వాత కూడా శరీరంలో యాంటీబాడీలు ఉన్నాయని అన్నాఉ. ఈ టీకా సార్స్‌పై కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే ఫైజర్‌.
 
స్ఫుత్నిక్‌
రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ ప్రపంచంలోనే అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న తొలి టీకా. ఇప్పటికే ఆ దేశంలో కొన్ని మిలియన్ల మంది ఈ టీకా తీసుకున్నారు. గమాలియా ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ఈ టీకా రెండు డోసులతో రెండేళ్ల పాటు ఢోకాలేదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments