Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల సిబ్బందికి టీకా ఇవ్వండి: ఎస్‌ఈసీ

ఎన్నికల సిబ్బందికి టీకా ఇవ్వండి: ఎస్‌ఈసీ
, ఆదివారం, 10 జనవరి 2021 (10:06 IST)
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. ఉద్యోగులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా శానిటైజర్‌ , మాస్కులు సరఫరా చేయాలని కమిషన్‌ తెలిపింది.

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్‌లో ఎన్నికల సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.

నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి: ఏపీ ఎన్జీవోలు
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ తీరుకు నిరసనగా ఎన్నికల ప్రక్రియను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తక్షణమే నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐదు లక్షల మంది ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఎన్నికల కమిషనర్‌ వ్యవహారశైలి ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గలేదని, ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 64 సంఘాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయని స్పష్టం చేశారు. అత్యవసరంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధపదవుల్లో ఉన్న వారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
 
ఎన్నికల నియమావళిపై సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వేగవంతం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రవర్తనా నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవర్తనా నియమావళి అమలులో ఉండదని స్పష్టం చేశారు.

పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్ది చేకూర్చే పనులు చేపట్టవద్దని సూచించారు. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ : టీటీడీ చైర్మన్