Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం: ఆదిత్యానాధ్ దాస్

Advertiesment
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం: ఆదిత్యానాధ్ దాస్
, బుధవారం, 6 జనవరి 2021 (20:15 IST)
కోవిడ్-19 వైరస్ నియంత్రణలో భాగంగా త్వరలో చేపట్టనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం కాన్పరెన్సు హాల్లో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి చేపట్టాల్సిన వివిధ ఏర్పాట్లపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలివిడతలో రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రవేట్ హెల్తుకేర్ సిబ్బందితో పాటు ఐసిడిఎస్ వర్కర్లు కలిపి 3లక్షల 70వేల మంది హేల్తుకేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు.

అలాగే కేంద్ర రాష్ట్ర పోలీసులు,ఆర్మడ్ ఫోర్సులు,హోంగార్డు,జైళ్ల సిబ్బంది,విపత్తుల నిర్వహణ సంస్థ వాలంటీర్లు, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్,మరియు మున్సిపల్ వర్కర్లు,రెవెన్యూ సిబ్బందితో కలిపి 9లక్షల మందికి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని చెప్పారు.

అలాగే 50యేళ్ళ వయస్సు నిండి చక్కెర వ్యాధి,హైపర్ టెన్సన్,క్యాన్సర్ ఊపిరి తిత్తులు వ్యాధితో ఇబ్బంది పడే వారికి కూడా తొలి విడత ఇంజక్సన్ల వేయడంలో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య,హోం శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మరికొందరు కార్యదర్శులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎప్పటికప్పడు సమీక్షిస్తుందని సిఎస్ పేర్కొన్నారు.

అలాగే జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పి వైద్య ఆరోగ్య తదితర శాఖలతోను, మండల స్థాయిలో తహసిల్దార్ అధ్యక్షతన,మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమీషనర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన టాస్కు ఫోర్సు కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై ఇందుకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షిస్తాయని సిఎస్ చెప్పారు.

అంతేగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు,సూచనలు,సలహాలు తీసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిల్లో 24గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ నిల్వ,సరఫరా,కోల్డుచైన్ నిర్వహణ,ఐస్ బాక్సులు,ప్రీజర్లు,వ్యాక్సిన్ క్యారియర్స్ తదితర అంశాలపై చేపట్టాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ సమీక్షించారు.తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఇంకా డిమాండుకు అనుగుణంగా కావాల్సిన సహాయ సహకారాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరుగుతుందని సిఎస్ చెప్పారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు ఆవకాశం లేకుండా కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇప్పటికే అవసరమైన ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.రాష్ట్ర జిల్లా మండల స్థాయి టాస్కుఫోర్సు కమిటీలను ఏర్పాటు చేయడం జరిందని ఆయా కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటాయని తెలిపారు.

ఈస్టీరింగ్ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కె.భాస్కర్ తొలి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై వపర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1677 కోల్డు చైన్ పాయింట్లు(వ్యాక్సిన్ స్టోరేజి పాయింట్లు), 4వేల 65 కోల్డు చైన్ పరికరాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

వ్యాక్సిన్ రవాణాకు సంబంధించి ఇప్పటికే 2నుండి 8డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ట్ణోగ్రత నిర్వహించేలా 19 ఇన్సులెటెడ్ వ్యాక్సిన్ వ్యాన్లను సిద్ధం చేయగా మరో 26 వాహనాలను కూడా సిద్దం చేస్తునట్టు చెప్పారు. అలాగే 17వేల 32 మంది వ్యాక్సినేటర్ల(ఎఎన్ఎం)లను ఏర్పాటు చేశామని తెలిపారు.అంతేగాక లాజిస్టిక్ నిర్వహణకు సంబంధించి 7వేల 459 ఆరోగ్య ఉప కేంద్రాలను కూడా సిద్ధంగా ఉంచామని వివరించారు.

40వేల 410 వ్యాక్సినేటర్లు,సెషన్ సైట్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని అన్నారు.కోల్డు చైన్ నిర్వహణకు సంబంధించి అవసరమైన వాక్ఇన్ ప్రీజర్లు,వాక్ కూలర్లు,డీప్ ఫ్రీజర్లు,ఐఎల్ఆర్ బాస్కెట్లు,డయల్ ధెర్మోమీటర్లు,కోల్డు బాక్సులు,వ్యాక్సిన్ క్యారియర్లు,డే కారియర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కోల్డుచైన్ నిర్వహణకు సంబంధించి 3లక్షల 76వేల 148 లీటర్ల నిల్వకు స్థలం అందుబాటులో ఉందన్నారు.అంతేగాక 8మాసాలకు సరిపడా 5కోట్లు ఇన్ టు 2 డోసులు 10కోట్ల డోసులకు సరిపడ కోల్డుచైన్ నిర్వహణకు స్థలం అందుబాటులో ఉందని కమీషనర్ భాస్కర్ వివరించారు.

ఈసమావేశంలో హోం,టిఆర్అండ్బి,విద్యా,కార్మిక,ఉపాధి కల్పన,మైనార్టీ సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులు కుమార్ విస్వజిత్,యం.టి కృష్ణ బాబు,బి.రాజశేఖర్,బి.ఉదయలక్ష్మి, రిజ్వి,అదనపు డిజి శాంతి భద్రతలు రవిశంకర్ అయ్యన్నార్,ఇతర శాఖల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా భద్రత లో ఏ.పి పోలీస్ మరో ముందడుగు