‘ఉజ్వల్ యోజన’ బండారం బయటపెట్టిన హేమమాలిని’: నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:17 IST)
సాధారణంగా రాజకీయాలలో ఒక పక్షం వారిని ప్రతిపక్షం వారు తిడుతూ ఉండడం ఎప్పుడూ చూస్తూండేదే... కానీ ఒక పార్టీ అభ్యర్థి తమ స్వంత పార్టీనే ఇరుకున పెట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
 
వివరాల్లోకి వెళ్తే... లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున యూపీలోని మధుర నుండి పోటీ చేస్తున్న... బాలీవుడ్ నటి హేమమాలిని ఎన్నికల ప్రచారం అనుకున్నారో లేక ఫోటో షూట్‌లు అనుకున్నారో ఏమో కానీ... మొన్నటికి మొన్న గోధుమ పంట కోసేస్తూ... ఫోటోలకు ఫోజులు ఇవ్వగా... ఇటీవల తాజాగా తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసిన మరో ఫొటో వైరల్‌గా మారి... తమ స్వంత పార్టీ కాళ్లకే చుట్టుకుంటోంది. 
 
ఇంతకీ ఈ ఫోటోలో హేమమాలిని తలపై కట్టెల మోపును మోస్తున్న ఒక వృద్ధురాలి పక్కన నిలబడి ఉన్నారు. ఈ ఫోటోను చూసినవారంతా వ్యంగ్యంగా కామెంట్లు చేసేస్తూంటే, ఒక నెటిజన్ మాత్రం ప్రధాని ఉజ్వల్ యోజన పేరిట ప్రతీ ఇంటికీ వంటగ్యాస్ సదుపాయాన్ని కల్పించామని చెప్తూంటారు. 
 
మరి ఈ వృద్ధ మహిళ వంట కోసం కట్టెల మోపును ఎందుకు తీసుకువెళుతోంది? అంటూ ప్రశ్నించారు. కాగా... మరో నెటిజన్ మరో అడుగు ముందుకేసి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అనంతరం ‘ఉజ్వల్ యోజన’ బండారం బయటపెట్టిన హేమమాలిని’ అంటూ కామెంట్ చేసారు.
 
మరి... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడింది అంటే ఇదేనేమో కదా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Friday movies: సినిమా ప్రేమికులకు పదికిపైగా కనువిందు చేయనున్న ఈ వారం సినిమాలు

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments