Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ డాక్టర్ దుస్తులు మార్చుకుంది... మరో డాక్టర్ వీడియో తీశాడు.. అందరికీ షేర్ చేశాడు

వైద్యులు నివాసం ఉండే క్వార్టర్స్‌లో తోటి మహిళా వైద్యురాలు దుస్తులు మార్చుకుంటూండగా వైద్య వృత్తిలోనే ఉన్న తోటి డాక్టర్ ఆ దృశ్యాన్ని వీడియో తీసి తన స్నేహితులందరికీ షేర్ చేసిన ఘటన ముంబై మహానగరంలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (05:01 IST)
చదువూకున్నోళ్ల కన్న సాకలన్న మేలూ, అయ్యా నే సదువుకోను బోనే అంటూ ముప్పై ఏళ్ల క్రితం గద్దర్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మొత్తంగా పాట పాడిన రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. చదువుకుంటే ఉన్న కాస్త మతి కూడా పోతుందనేది అందరి విషయంలోనూ వర్తించదేమో కానీ కొందరి విషయంలో మాత్రం నేటికీ ఇది వర్తిస్తూనే ఉంది. వైద్యులు నివాసం ఉండే క్వార్టర్స్‌లో తోటి మహిళా వైద్యురాలు దుస్తులు మార్చుకుంటూండగా వైద్య వృత్తిలోనే ఉన్న తోటి డాక్టర్ ఆ దృశ్యాన్ని వీడియో తీసి తన స్నేహితులందరికీ షేర్ చేసిన ఘటన ముంబై మహానగరంలో జరిగింది. 
 
విషయానికి వస్తే.. వైద్యులు నివాసముండే క్వార్టర్స్‌లో ఓ మహిళా డాక్టర్‌ దుస్తులు మార్చుకుంటుండగా అదే అంతస్తులో ఉన్న 29 ఏళ్ల వైద్యుడు వీడియో తీశాడు. దుస్తులు మార్చుకుంటున్న వీడియోను మహిళా డాక్టర్‌ స్నేహితురాళ్లు ఆమెకు చూపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తొలుత ఈ విషయాన్ని ఆమె స్నేహితురాళ్లు చెప్పినపుడు నమ్మలేకపోయినా.. వీడియో చూశాక నిర్ఘాంతపోయారు. 
 
దీంతో వెంటనే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీయగా, చివరకు ఓ డాక్టర్‌ నుంచి వచ్చిందని తేలింది. దీంతో ఆమె ముంబయిలోని జుహూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. 354, 379, 66ఏ, 67ఏ సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఎలాంటి వీడియోలు చిత్రీకరించలేదని ఆ డాక్టర్‌.. పోలీసులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి ఆ డాక్టర్ స్నేహితులకు ఆ వీడియోను అతడి ఫోన్ నుంచి షేర్ చేసిందెవరు? 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments