Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డిపై ఇండిగో, ఎయిర్ ఇండియా నిషేధం

విశాఖపట్నం విమానాశ్రయంలో సంస్థ ఉద్యోగిని వెనుకనుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిన దివాకర్ రెడ్డి మొరటుగా ముందుకు తోయటం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో టీడీపీ ఎంపీ అడ్డంగా బుక్కయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎయిర

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (02:40 IST)
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ సీనియర్ అధికారితో దురుసుగా ప్రవర్తించి మహారాష్ట్ర శివసేన ఎంపీపై నిషేధం విధించి సరిగ్గా మూడు నెలలైనా కాలేదు. మళ్లీ తనకు పోటీగా తయారైన తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించడం సంచలనం కలిగిస్తోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో సంస్థ ఉద్యోగిని వెనుకనుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిన దివాకర్ రెడ్డి  మొరటుగా ముందుకు తోయటం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో టీడీపీ ఎంపీ అడ్డంగా బుక్కయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు దివాకర్ రెడ్డిని ఇకపై తమ విమానాల్లో అనుమతించబోమని తేల్చి చెప్పేశాయి.
 
వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగో, ఎయిర్ ఇండియా నిషేధం విధించాయి. జేసీని తమ విమానాల్లో అనుమతించబోమని తేల్చి చెప్పాయి. బోర్డింగ్ పాస్ ఇవ్వనందుకు జేసీ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఎయిర్‌పోర్ట్‌కు ఆలస్యంగా రావడంతో సమయం ముగిసిందని, బోర్డింగ్ పాస్ ఇవ్వలేమని విమాన సిబ్బంది చెప్పారు. 
 
సిబ్బంది సమాధానంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ప్రింటర్‌ను విసిరికొట్టారని సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు జేసీపై నిషేధం విధించాయి. మిగతా విమానయాన సంస్థలు కూడా జేసీపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వివాదానికి మూలం ఏమిటి?
విశాఖ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఇండిగో విమానాశ్రయ అధికారులపై దురుసుగా వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసింది. బుధవారం రాత్రి తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు వివాహ వేడుకలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన జేసీ.. ఈ రోజు ఉదయం తిరిగి పయనమయ్యేందుకు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వచ్చేటప్పటికే ఇండిగో విమానం కౌంటర్‌ మూసివేశారు. దీంతో ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. అక్కడే ఉన్న ప్రింటర్‌ను ధ్వంసంచేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతేకాకుండా ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, దిల్లీకి వెళ్లి తేల్చుకుంటానంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
దీంతో సిబ్బంది ఆయనకు ఇండిగో టికెట్‌ ఇచ్చి అదే విమానంలో పంపించినట్టు సమాచారం. ఈ తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయన స్పందిస్తూ.. బోర్డింగ్‌ పాస్‌ సమయం పూర్తవడంతో అధికారులు కౌంటర్‌ను మూసివేశారని.. తనకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అంతేకానీ.. తానెలాంటి విధ్వంసానికి పాల్పడలేదని ఆయన స్పష్టంచేశారు. బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాలని మాత్రమే అడిగినట్టు చెప్పారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments