వార్తలను యధాతథంగా కొందరు చూపించాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు ఇబ్బందులు పడిన ఘటనలు వున్నాయి. ఆమధ్య కేరళ వరదల్లో వాస్తవ దృశ్యాలను చూపించాలన్న తాపత్రయంలో ఓ విలేకరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో దిగి రిపోర్ట్ చేసే యత్నం చేసాడు. అదృష్టవశాత్తూ పక్కనే వున్న వ్యక్తి గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.