Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి.. రెండింటి మధ్యా తేడా ఏంటి?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చిదని కొందరు అంటుంటే.. కాదు కార్డియాక్ అరెస్ట్ అని మరికొందరు అంటున్నారు. దీంతో అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే,

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (11:01 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చిదని కొందరు అంటుంటే.. కాదు కార్డియాక్ అరెస్ట్ అని మరికొందరు అంటున్నారు. దీంతో అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటో పరిశీలిద్ధాం. 
 
వాస్తవానికి కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియాక్ అరెస్టు శరీరంలోని వివిధ భాగాలకు రక్తసరఫరాను గుండె ఆపేసినప్పుడు కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది. పేషెంట్ ఉన్నట్టుండి కుప్పకూలి, సాధారణంగా ఊపిరి తీసుకోకపోవడం, స్పందనలు లేకపోవడం వంటి లక్షణాలు ఇందులో సంభవిస్తాయి.
 
గుండెపోటు అంటే గుండె కండరాలకు రక్తసరఫరాకు ఉన్నట్టుండి ఆటంకం కలగడం. దానివల్ల గుండెనొప్పి వచ్చి, గుండెకు శాశ్వతంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ.. అప్పటికీ మిగిలిన రక్తనాళాల ద్వారా గుండె మాత్రం శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తూనే ఉంటుంది, అందువల్ల పేషెంట్ ఊపిరి తీసుకుంటూనే ఉంటాడు. కానీ కార్డియాక్ అరెస్టులో మాత్రం శరీరభాగాలకు రక్తం అందదు. గుండెపోటు, కార్డియాక్ అరెస్టు రెండూ ప్రాణాంతకమే. అయితే తక్షణ చికిత్స అందిస్తే మాత్రం కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.
 
కారణం ఏంటి?
చాలావరకు వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (వీఎఫ్‌).. అంటే, గుండె లయ అసాధారణంగా మారడం వల్లే కార్డియాక్ అరెస్టు సంభవిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గుండెకు సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ దారుణంగా పడిపోయినపుడు ఈ పరిస్థితి వస్తుంది. దానివల్ల శరీర భాగాలకు గుండె నుంచి రక్త సరఫరా జరగదు.
 
కార్డియాక్ అరెస్టు తర్వాత కోలుకుంటారా?
వెంటనే సరైన చికిత్స అందిస్తే, కార్డియాక్ అరెస్టు నుంచి కూడా కోలుకునే అవకాశాలున్నాయి. చెస్ట్ వాల్ ద్వారా డీఫిబ్రిలేటర్ అనే పరికరంతో విద్యుత్ షాక్‌లు ఇచ్చి కొన్ని సందర్భాల్లో దీన్ని సరిచేస్తారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments