Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిబ్బరానికి గుండెపోటు : జయలలితకు గుండె ఆగిందా.. గుండెపోటు వచ్చిందా?

గుండె నిబ్బరానికి నిలువెత్తు నిదర్శనంగా ముఖ్యమంత్రి జయలలితను చెప్పుకోవచ్చు. అలాంటి గుండెకే గుండెపోటు వచ్చింది. అసలు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితు గుండెపోటు వచ్చిదా? లేదా గుండె ఆగ

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (10:52 IST)
గుండె నిబ్బరానికి నిలువెత్తు నిదర్శనంగా ముఖ్యమంత్రి జయలలితను చెప్పుకోవచ్చు. అలాంటి గుండెకే గుండెపోటు వచ్చింది. అసలు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితు గుండెపోటు వచ్చిదా? లేదా గుండె ఆగిందా? అనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
కానీ అపోలో ఆస్పత్రి వైద్యులు మాత్రం జయలలితకు వచ్చినది గుండెపోటు కాదని.. ఆమె గుండె కొద్దిసేపు ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) అని పేర్కొంటూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ కారణంగానే ఆమెకు సోమవారం ఉదయం ఒక ఆపరేషన్ కూడా జరిగినట్లు పార్టీ ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. 
 
మరోవైపు.. జయలలితకు యాంజియోగ్రామ్‌ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. 
 
ఇదిలా ఉంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద 3000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌ను, దుకాణాలను ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పలు విద్యా సంస్థలు మాత్రం స్వతహాగా సెలవు ప్రకటించాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments