తిమింగలం వాంతి ద్వారా వచ్చే జోముకు అంత ధరనా?

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (22:50 IST)
తిమింగలం వాంతి చేసుకోవడం వల్ల లేదా వాటి నోటి నుంచి వచ్చే మైనం వంటి చిక్కని పదార్థానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. దీంతో అంబర్ గ్రీస్ లేదా గ్రే అంబర్ లేదా నీటిపై తేలాడే బంగారంగా పిలుస్తుంటారు. సహజసిద్ధంగా లభించే ఈ పదార్థం అరుదైనది. పైగా, అత్యంత విశిష్టమైనది కావడంతో అతి భారీ ధర పలుకుతుంది. 
 
ఇది ఎంతో సువాసన, ప్రత్యేక గుణాలు కలిగిన తిమింగలం వాంతిని సుగంధ పరిమణ ద్రవ్యాలు, కాస్మాటిక్స్ ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తిమింగలం వాంతితో తయారైన పెర్ఫ్యూ‌లు అత్యంత ఖరీదైనవిగా చలాణిలో ఉన్నాయి. 
 
ఇది తిమింగిలాల జీర్ణ వ్యవస్థ నుంచి నోటి ద్వారా వెలుపలికి విసర్జితమయ్యే ఓ  పదార్థం. ఇది తిమింగలం పేగుల్లో ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ ఆంబర్ గ్రీస్ అమ్మకాలపై వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1972 ప్రకారం దేశ వ్యాప్తంగా నిషేధం ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు 4.12 కేజీల ఆంబర్ గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.10 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు ఆంబర్ గ్రీస్ కలిగివున్నారంటూ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. 
 
దీంతో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ లక్నోలోని గోమతీ నగర్ ప్రాంతంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఆంబర్ గ్రీస్‌ను కలిగివున్న నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, ఈ యేడాది జూలైలో కేరళ జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా రూ.28 కోట్ల విలువైన ఆంబర్ గ్రీస్ వారి కంటపడగా, దాన్ని వారు అదికారులకు అప్పగించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments