Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార గృహ నిర్వాహకుల చేతిలో వృద్ధుడు హతం

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (12:42 IST)
ఓ వ్యభిచార గృహం నిర్వాహకులు తమ వ్యభిచార వృత్తికి అడ్డుపడుతున్నాడనే కోపంతో ఒక వృద్ధుడిని హతమార్చిన దారుణ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పబ్నాపర పట్టణానికి చెందిన శ్యాం హల్దార్, అతని భార్య చందన, వారి స్నేహితుడు మంటూ హల్దార్ ఓ రైతు ఇంట్లో వ్యభిచార గృహాన్ని నడుపుతూ వచ్చారు. అయితే, తమ ప్రాంతంలో వ్యభిచార గృహం నిర్వహించడంపై దుఖుహల్దార్ అనే 70 ఏళ్ల వృద్ధుడు వ్యతిరేకించాడు. 
 
తమ ప్రాంతంలో వ్యభిచారం నడపడాన్ని వృద్ధుడు అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వ్యభిచార గృహ నిర్వాహకులు కర్రలు, రాడ్లు, ఇటుకలు తీసుకొని దుఖు హల్దార్‌పై దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దుఖును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజురోజుకీ మానవత్వం ఎంత మంటకలిసిపోతోందో పశ్చిమ బెంగాల్‌లోని ఘటన నిరూపిస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments