Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భిణి అనే కనికరం లేదు.. పొట్టపైనే కొట్టిన బీజేపీ నేత.. గర్భస్థ శిశువు మరణించింది..

నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:25 IST)
నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నడియా జిల్లాలోని దుబులియా పోలీసుస్టేషను పరిధిలోని తంత్లా గ్రామానికి చెందిన శంబుచంద్ర దాస్ అనే వ్యక్తి కీర్తనలను అధిక సౌండుతో పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన స్థానిక బీజేపీ పంచాయతీ ప్రధాన్ పలాస్ కుమార్ బిస్వాస్ తోపాటు నలుగురు వ్యక్తులు వచ్చి దాస్‌పై దాడికి దిగారు. దాస్‌ను కొడుతుండటంతో అతని సోదరి మాయారాణి (గర్భిణీ) అడ్డుకునేందుకు ప్రయత్నించింది. 
 
అంతే ఆగ్రహించిన దుండగులు గర్భవతి అని కూడా చూడకుండా ఆమె పొట్టపై కొట్టారు. దీంతో గర్భస్థ శిశువు మరణించాడు. ఆస్పత్రిలో ప్రస్తుతం మాయారాణి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బీజేపీ ప్రధాన్ బిస్వాస్ తోపాటు నలుగురిపై దాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులైన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం