Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమబెంగాల్ పేరు మార్పు?: మమత

Webdunia
బుధవారం, 28 జులై 2021 (03:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. బెంగాల్ సీఎంగా మూడోసారి ఎన్నిక అయ్యాక మోదీతో ఆమె భేటీ కావడం ఇదే తొలిసారి.

కాగా ఈ భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మరిన్ని కొవిడ్ టీకాలు అవసమని ప్రధానికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ మధ్య సంచలనంగా మారిన పెగాసస్ అంశంపై ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బాగుండేదని మమత అభిప్రాయపడ్డారు.
 
‘‘ప్రధానితో ఇది మర్యాదపూర్వక సమావేశం మాత్రమే. అయితే మీటింగ్ సమయంలో మా రాష్ట్రానికి మరిన్ని కోవిడ్ టీకాలు, మందులు కావాలన్ని అంశాన్ని లేవనెత్తాను. అలాగే రాష్ట్ర పేరు మార్పు అంశాన్ని కూడా లేవనెత్తాను. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు’’ అని మమతా బెనర్జీ అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘పెగాసస్ మీద ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేయాలి’’ అని ఆమె అన్నారు.
 
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వేళ మోదీ-దీదీ మధ్య మాటల యుద్ధం సాగింది. విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ, టీఎంసీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా రాజకీయ హింస నెలకొంది. తమ పార్టీవారిని అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించిందని బీజేపీ ఆరోపించింది.

దీనిపై రగడ కొనసాగుతుండగానే పెగాసస్ ఉదంతం తెరపైకొచ్చింది. దీంతో తృణమూల్ సర్కారు దీనిపై విచారణకు కూడా ఆదేశించింది. ఈ తరుణంలో దీదీ ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మమత బుధవారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments