అల్లా చెప్పడంతో.. కన్నకూతురుని పెళ్లి చేసుకున్నాడు.. గర్భవతిని చేశాడు..

ఒకవైపు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. అల్లా చెప్పాడని కన్నకూతురునే ఓ దుర్మార్గుడు పెళ్లి

Webdunia
గురువారం, 5 జులై 2018 (14:58 IST)
ఒకవైపు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. అల్లా చెప్పాడని కన్నకూతురునే ఓ దుర్మార్గుడు పెళ్లి చేసుకుని గర్భవతిని చేశాడు. ఇదంతా కన్నతల్లికి తెలిసే చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురి జిల్లా కసియాజోరా గ్రామంలో 36 ఏళ్ల అఫాజుద్దీన్ అనే వ్యక్తి అల్లా ఆదేశించాడని తన 15 ఏళ్ల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఆయన భార్య సకీనా పూర్తి మద్దతు తెలిపింది. బిడ్డ మంచి కోసమే ఇలా చేస్తున్నానని చెప్పడంతో ఆమె మూఢంగా నమ్మేసింది. ఈ విషయాన్ని ముందుగా స్థానికులు గమనించలేదు. 
 
కానీ అఫాజుద్ధీన్ కుమార్తె శరీరంలో మార్పులు గమనించిన కొందరు బాలికను నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో అఫాజుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన భర్తను సకీనా వెనకేసుకొచ్చింది. 
 
అల్లా చెప్పడం వల్లే తన భర్త ఈ విధంగా చేశాడని, తన భర్త అసత్యాలు పలకడని గొప్పలు చెప్పింది. అయితే ఈ దారుణంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కన్నబిడ్డపై ఈ అఘాయిత్యానికి పాల్పడిన తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments