Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ వేడుకలో సిగరెట్ కాల్చిన వధువు తల్లి - పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 5 జులై 2023 (14:33 IST)
కొన్ని సంఘటనలు వినేందుకు విచిత్రంగా ఉంటాయి. కొందరి చేష్టలు వినడానికి ఆసక్తిగాను ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. అయితే, ఇక్కడో వరుడు కాబోయే భార్య తల్లి వివాహ వేడుకలో సిగరెట్ కాల్చిందన్న కోపంతో ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత పంచాయతీ పెద్దల జోక్యంతో శాంతించి మళ్లీ పెళ్లికి అంగీకరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 27వ తేదీన కళ్యాణ మండపానికి చేరిన వరుడు వివాహానికి ముందు జరిగిన వేడుకలో తనకు కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ నృత్యం చేయడాన్ని కళ్లారా చూసి ఒకింత షాక్‌కు గురయ్యాడు. సభ్యత, సంప్రదాయం లేకుండా ఇలా సిగరెట్ తాగడమేంటని నిలదిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
అంతటితో అతను శాంతించలేదు. పైగా, తక్షణం వివాహాన్ని నిలిపివేయించాడు. పెళ్లి రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన బంధువులతో మండపం నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించి వరుడికి నచ్చజెప్పడంతో మళ్లీ పెళ్లి జరిగింది. దీంతో ఈ వివాహ కథ సుఖాంతమైంది. 
 
75 యేళ్ల సుధీర్ఘ పోరాటం... 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలే...
 
ఆదివాసీ ప్రజల 75 యేళ్ల సుధీర్ఘ పోరాటానికి ప్రతిఫలం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది. ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ బెంచ్ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం సంచలన తీర్పునిచ్చింది. 
 
అదేసమయంలో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న సీజే ధర్మాసనం ఆదివాసీయేతరుల అప్పీల్‌ను కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఫలితంగా 75 యేళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి ఫలితం దక్కింది. వీరంతా పట్టువదలని విక్రమార్కుల్లా పోరాటం సాగించి చివరకు విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
కాగా, ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగ పరిధిలోని ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి సదరు 23 గ్రామాలు రావంటా ఆదివాసీయేతర రాజకీయ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఎట్టకేలకు ఆదివాసీలకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments