Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో అదే చేస్తాం.. ఆర్మీ కొత్త చీఫ్‌ ముకుంద్‌

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (15:41 IST)
భారత సైన్యానికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ నరవానే మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో చేపట్టబోయే ఆపరేషన్‌కు సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పలు ప్రణాళికలు ఉన్నాయన్నారు.
 
ఇందుకు తమ వద్ద వ్యూహాలు సిద్ధంగా వున్నాయని.. ఆయా అవసరాలకు తగినట్లు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఆదేశాలనైనా విజయవంతంగా అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో దాడులు చేసే హక్కు భారత్‌కు ఉందని పేర్కొన్నారు. 
 
కాగా.. భారత 28వ సైన్యాధ్యక్షుడిగా డిసెంబర్ 31 మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉగ్రవాదులను ఏరివేయడం, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడంతో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మనోజ్ ముకుంద్ నరవానే పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 
 
చైనాతో సరిహద్దుల్లో మన బలగాల సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. ఏ సమయంలోనైనా ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేలా ఆర్మీని సంసిద్ధం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments