Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌ జీ.. ఇంత దిగజారుడు మాటలా?.. ఛీ.. ఛీ :: మనోహర్ పారికర్

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (17:05 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనను పరామర్శిచేందుకు వచ్చిన రాహుల్.. నీచ రాజకీయాల కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తానని భావించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా, తమ మధ్య జరిగిన ఐదు నిమిషాల భేటీలో రాఫెల్ డీల్ అంశమే చర్చకు రాలేదని చెప్పారు.
 
గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్‌ను రాహుల్ గాంధీ మంగళవారం గోవాకు వెళ్లి పరామర్శించిన విషయం తెల్సిందే. ఈ భేటీ తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ఇది కేవలం వ్యక్తిగతమని చెప్పారు. కానీ, బుధవారం ఆయన మాట మార్చారు. రాఫెల్‌ డీల్‌పై కొత్తగా చెప్పాల్సిందేమీ లేదనీ, మిత్రుడు అనిల్ అంబానీకి లబ్దిచేకూర్చేందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఈ డీల్‌ను ఖరారు చేశారంటూ చెప్పారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టించారు. 
 
దీంతో పారికర్ మీడియా ముందుకు వచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. నీ రాజకీయ లబ్ధి కోసం నన్ను పరామర్శించావని తెలిసి చాలా బాధ కలుగుతుంది. అసలు 5 నిమిషాల ఆ భేటీలో రాఫెల్ అంశం మన మధ్య చర్చకు వచ్చిందా అని పారికర్ ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ లేఖను కూడా ఆయన విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించడానికి వెళ్లి దానిని నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకు అని రాహుల్‌కు పారికర్ సూచించారు. నిజాలను మీరే బయటపెడతారని ఆశిస్తున్నానని అన్నారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు మీ చిత్తశుద్ధిని శంకించేలా ఉన్నాయని రాహుల్‌పై పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విధానం ప్రకారమే రాఫెల్ డీల్ జరిగిందని మరోసారి పారికర్ స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments