Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా ఎయిర్‌ పోర్టు.. విమానాలపై తేనెటీగలు.. ప్రయాణీకులపై దాడి.. చివరికి?

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (13:13 IST)
Flight
సాధారణంగా విమానాల్లో జర్నీ అంటే అందరూ హ్యాపీగా వెళ్తారు. కానీ అక్కడ మాత్రం ప్రయాణీకులు విమానం ఎక్కాలంటేనే జడుసుకున్నారు. ఎందుకంటే.. తేనెటీగల దాడి కోసం. లక్షల కొద్ది  తేనెటీగలు విమానాలపై వాలే సరికి ప్రయాణీకులు భయంతో జడుసుకున్నారు.

ఎప్పుడూ లేనిది ఇలా హనీబీస్ ఎటాక్ చెయ్యడంతో... ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అవతల ప్యాసింజర్లు... టైమైపోతోంది... త్వరగా ఏదో ఒకటి చెయ్యండి అని అంటుంటే... అధికారులకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చింది.
 
రెండు విమానాల్లోనూ 150 మంది చొప్పున ప్రయాణికులు ఎక్కక ముందే దాడి చేశాయి తేనెటీగలు. కానీ అవి ఎంతకూ వెళ్లకపోవడం సమస్యైంది. ఓ ఉద్యోగి... ఇచ్చిన సలహా బాగానే ఉందనుకుంటూ వాటర్ కెనాన్‌లను తెచ్చి తేనెటీగల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆదివారం మధ్యాహ్నం చేసిన ఈ ప్రయత్నం ఫలించడంతో సోమవారం ఉదయం కూడా అలాగే చేసి మొత్తానికి రెండు విమానాలపైనా హనీబీస్ వెళ్లిపోయేలా చేశారు. 
 
ఈ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చాయి. తేనెటీగలు వెళ్లిపోయాక మరో కొత్త సమస్య వచ్చింది. ఒక్క తేనెటీగ కూడా విమానంలోపలికి వెళ్లలేదు. అయినప్పటికీ ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా విమానాల లోపల ఫ్యూమిగేషన్ చేశారు. దాంతో... రెండు విమానాల్లోనూ ప్రయాణికులకు ఆలస్యమైంది. ఆదివారం గంట లేటుగా, సోమవారం మార్నింగ్ కూడా గంట లేటుగా విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఇదంతా కోల్‌కతా ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments