Webdunia - Bharat's app for daily news and videos

Install App

35కిలో మీటర్లు.. బైకుపైనే అమ్మ మృతదేహం.. పాము కాటేసిందని..?

అనారోగ్యం పాలైతే ఆంబులెన్స్‌లో ఆస్పత్రులకు తీసుకెళ్లలేరు. అలాగే మరణించాక స్వగ్రామాలకు ఆంబులెన్స్‌ల్లో తరలించేందుకు డబ్బుల్లేక మోసుకెళ్లిన ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఓ యువకుడు తన తల్లి మృతదేహాన్ని పో

Webdunia
గురువారం, 12 జులై 2018 (13:43 IST)
అనారోగ్యం పాలైతే ఆంబులెన్స్‌లో ఆస్పత్రులకు తీసుకెళ్లలేరు. అలాగే మరణించాక స్వగ్రామాలకు ఆంబులెన్స్‌ల్లో తరలించేందుకు డబ్బుల్లేక మోసుకెళ్లిన ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఓ యువకుడు తన తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బైకు మీద 35కిలో మీటర్ల దూరం తీసుకెళ్లాడు.


ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టికమ్ గఢ్ జిల్లాలోని మస్తాపుర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు తల్లి శవాన్ని బైక్‌పై తీపుకెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇంకా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని నిరాకరించడంతో తన తల్లి శవాన్ని బైక్‌పై తరలించాడు. మస్తాపూర్‌ గ్రామానికి చెందిన కున్వర్‌ భాయ్‌ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టానికి తరలించాల్సిందిగా సూచించారు. 
 
కానీ పోస్టు మార్టం కోసం వాహన సదుపాయాన్ని ఆస్పత్రి సిబ్బంది కల్పించలేదు. దీంతో గత్యంతరం లేక తన బైక్‌పై తల్లి శవాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్‌కు తరలించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్‌ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
పాము కాటేసిన తర్వాత నయమవుతుందనే ఆశతో తన తల్లిని రాజేశ్ ముందు దేవాలయానికి తీసుకెళ్లాడని, ఆ తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. 108కి ఫోన్ చేసి ఉంటే అంబులెన్స్ వచ్చేదనీ కానీ అలా చేయలేదని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments