Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలెట్టారు.. ఎప్పుడు కూల్చేస్తారు: ప్రకాష్ రాజ్ ప్రశ్న

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన చారిత్రక కట్టడం తాజ్‌ మహల్‌‌పై వివాదం కొనసాగుతోంది. తాజ్ మహల్ దేశద్రోహులు కట్టిన కట్టడం అని బీజేపీ యూపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:54 IST)
ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన చారిత్రక కట్టడం తాజ్‌ మహల్‌‌పై వివాదం కొనసాగుతోంది. తాజ్ మహల్ దేశద్రోహులు కట్టిన కట్టడం అని బీజేపీ యూపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ నయ్‌ కతియార్‌ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాజ్ మహల్ వున్న ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని, దానిని తేజో మహల్ అని పిలిచేవారని చెప్పారు. 
 
అప్పటి నవాబు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ప్రేమకు చిహ్నంగా ఆ శివాలయాన్ని కూల్చి అక్కడ తాజ్ మహల్‌ను నిర్మించాడని పేర్కొన్నారు. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని తాజ్ మహల్‌లోనే సమాధి చేయించాడని, ఇది జరిగిన వాస్తవ కధ అని కతియార్‌ వెల్లడించారు. అలాగే టూరిజం గైడ్‌లో స్థానం కల్పించకపోవడంతో ప్రారంభమైన వివాదం, రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో కొనసాగుతూనే వుంది.
 
హర్యానా క్రీడల మంత్రి అనిల్ విజ్ తాజాగా చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. తాజ్ మహల్ ఓ అందమైన శ్మశానం అని అనిల్ విజ్ చేసిన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలు పెట్టారు. ఇంతకీ, తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్‌ను చూపిస్తానని ట్వీట్‌లో ప్రకాష్ రాజ్ వంగ్యాస్త్రాలు  సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments