గుజరాత్‌లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరన్‌పురా సబ్ జోనల్ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం పడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని.. బీజేపీకి పెట్టని కోటగా మారుస్తారన్న నమ్మకముందన్నారు. రాష్ట్రంలోని బల్దియాకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మొదటి దశలో గురువారం ఆరు మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి.
అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్‌నగర్ ఉన్నాయి. ఆరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 23న ప్రకటించనున్నారు. అలాగే ఈ నెల 28న రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. 81 మునిసిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీల్లో పోలింగ్ జరుగనుండగా.. మార్చి 2న ఫలితాలు ప్రకటించనున్నారు.