Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు...

ఠాగూర్
ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (12:40 IST)
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో రెండోదిగా ఉన్న లండన్‌లో హీత్రూ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్ చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకున్నాక దానిని మరో ప్రదేశానికి తీసుకెళుతున్నాయి. ఆ సమయంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ తాగింది. ఈ ఘటన టెర్మినల్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధ్రువీకరించాయి. 'మా ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంత మేరకు దెబ్బతిన్నదో ఇంజినీర్లు అంచనావేస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం' అని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది.
 
ఇదిలావుంటే, యూకేలో కేథలిన్‌ తుపాను దెబ్బకు ఈ ఎయిర్‌ పోర్టులో విమానాలు ల్యాండ్‌ కావడానికి అవస్థలు పడుతున్నాయి. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్‌ వరకు వచ్చి.. బ్యాలెన్స్‌ సాధ్యం కాకపోవడంతో తిరిగి గాల్లోకి ఎగరిపోయింది. దాదాపు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. యూకేలో 140 విమాన సర్వీసులు రద్దు చేశారు. వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరోవైపు స్కాట్లాండ్‌లోని రైలు నెట్‌వర్క్‌పై కూడా దీని ప్రభావం పడింది. యార్క్‌ సిటీలో వరదలు వచ్చాయి. థేమ్స్‌ నదిపై ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments