Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ మానిటైజేషన్ కోసం.. దారుణానికి ఒడిగట్టిన ప్రభుత్వ టీచర్... ఏంటది?

ఠాగూర్
ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (12:24 IST)
తన భార్య యూట్యూబ్ చానల్‌కు మానిటైజేషన్ కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ దారుణానికి తెగబడ్డాడు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం నిర్వహించే వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశఆరు. ఈ విషయం వైరల్ కావడం, అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జజ్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాల్లోని గోపీనాథ్ జ్యూ నోడల్ పాఠశాలలో జగన్నాథ్ కార్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నట్టు ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు తొలుత తమకు సమాచారం అందిందని సదరు అధికారి తెలిపారు. విచారణ సందర్భంగా కార్ పేరు వెలుగులోకి వచ్చిందన్నారు.
 
పరీక్షలకు దాదాపు వారం రోజుల ముందు మార్చి 9న నిందితుడు క్లస్టర్ రీసెర్చ్ కోఆర్డినేటర్ నుంచి ఇటారా ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ తరుపున ప్రశ్నపత్రాలు తీసుకున్నాడని తెలిపారు. వాటిని నేరుగా స్కూలుకు తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చి ఫోన్‌తో ఫొటోలు తీసి తన భార్య యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని తెలిపారు. ఫలితంగా వారి ఛానల్ సబ్‌స్కైబర్లు సంఖ్య ఒక్కసారిగా 5 వేల నుంచి 30 వేలకు చేరుకుందని అన్నారు. 
 
ఈ నేపథ్యంలో యూట్యూబ్ ద్వారా నిందితులు ఎంత డబ్బు సంపాదించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వ టీచర్ భార్య పేరును కూడా కుట్రదారుగా చేర్చారు. అయితే, ఆమె పసిబిడ్డ తల్లి కావడంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments