టీడీపీ - జనసేన - బీజేపీ, మీడియాపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ ఐపీఎస్‌లు!!

ఠాగూర్
ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:27 IST)
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారంటూ విపక్ష పార్టీలు పదేపదే ఆరోపిస్తున్నాయి. ఏపీలో పోలీసులు కేవలం అధికార పార్టీ వైకాపాకు వంతపాట పాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొందరు ఐపీఎస్ అధికారుల వ్యవహారశైలి కూడా ఆ విధంగానే ఉంది. దీనికి సంబధించిన అనేక సంఘటనలు పక్కా ఆధారాలతో సహా మీడియాలో వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ పోలీసుల ఫిర్యాదు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలపై ఫిర్యాదు చేశాయి. అసత్య ఆరోపణలు చేస్తూ తమ నైతిక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ ఏపీ పోలీసులు తమ ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ మేరకు 19 మంది ఐపీఎస్‌ అధికారులు కలిసి రాసిన లేఖను ఏపీ సీఈవో మీనా కుమార్‌కు అందజేశారు. విజయవాడ కమిషనర్ కాంతిరాణా ఈ ఫిర్యాదు లేఖను అందించారు. 
 
టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలను చూపిస్తున్నారని ఏపీ పోలీసులు ప్రధానంగా ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. పదేపదే తప్పుడు కథనాలు, దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు  కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments