Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (15:32 IST)
మహారాష్ట్రలో పర్యాటకులను పులి వెంబడించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవిలో షికారుకు వెళ్లిన పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించింది. అంతే అందులోని పర్యాటకులు భయంతో కేకలు వేశారు. 
 
వాహనానికి, పులికి మధ్య దూరం కొన్ని అడుగులు మాత్రమే ఉండడం, వాహనం ఓపెన్ టాప్ కావడంతో పర్యాటకులకు చుక్కలు కనిపించాయి. కానీ డ్రైవర్ వేగం పెంచేయడంతో పర్యాటకులు సురక్షితంగా తప్పించుకోగలిగారు.
 
ఇలాంటి ఘటనలు టైగర్ రిజర్వ్‌లో కొత్తేమీ కాదని.. పర్యాటకుల వాహనం మరీ దగ్గరగా రావడంతో మూడున్నరేళ్ల చోటీ మధు అనే పులి ఆందోళనతో వారి వాహనాన్ని వెంబడించిందని రేంజ్ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర చెప్పారు. పులులు ఉండే ప్రదేశానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. ఘటనకు కారణమైన రహదారిని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments