Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశమంత ప్రేమ - సోదరి వివాహానికి విమానం బుక్ చేసిన యువతి

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:32 IST)
కొందరు ధనవంతులు మాత్రమే కాదు.. మధ్యతరగతి ప్రజలు కూడా తమ తమ ఇళ్ళలో జరిగే వివాహాలను తమ స్థాయికి తగినట్టుగా చేసుకుంటారు. పెళ్లిలో వడ్డించే ఆహారం మొదలుకుని అలంకరణ వరకు ఏమాత్రం రాజీపడరు. ఖర్చు కాస్త ఎక్కువైనా ఫర్లేదు కానా రాజీ మాత్రం పడరు. 
 
అయితే, దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత అనేక మంది అన్ని రకాల కార్యాలను తమ వరకే జరుపుకున్నారు. అంటే... తమతమ ఇళ్లకే పరిమితమైపోయాయి. ఇపుడు కరోనా ఆంక్షలన్నీ తొలగిపోయి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పర్యాటక ప్రదేశాలు మళ్లీ యధాస్థాయిలో తెరుచుకున్నాయి. ప్రపంచ దేశాలు కూడా విదేశీ పర్యాటకులను కూడా ఆహ్వానిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ జంట తమ వివాహం కోసం ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి విమానంలో పెళ్లికి బయలుదేరారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 
 
తన సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత విమామంలోని వారందరినీ చూపించారు. చివర్లో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు కోటి మంది వరకు ఈ వీడియోను చూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments