Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలైన్‌ను కారు తుడిచేందుకు వాడుతారా? వీడియో వైరల్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:42 IST)
Saline
రోగులకు ఎక్కించాల్సిన సెలైన్‌ను కారు తుడిచేందుకు వాడడం కలకలం రేపింది. అత్యవసర సమయాల్లో రోగి ప్రాణాన్ని కాపాడే సెలైన్‌ను ఇలా వాడటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యుడు తన కారుపై పడిన పెయింట్‌ను సెలెన్‌తో తుడిపిస్తుండగా.. కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
 
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి రంగులు వేస్తున్నారు. అక్కడే డాక్టర్ కారు నిలిపి ఉంచగా దానిపై సున్నం పడింది. దాన్ని తుడిచేందుకు సిబ్బంది ఏకంగా సెలైన్ వాడారు. ఇదేందటని ప్రశ్నించగా.. సెలైన్ బాటిల్‌లో నీరు పోసి తుడుస్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు.
 
అయితే.. సెలైన్ బాటిల్‌లో నీళ్లు నింపే అవకాశాలు తక్కువని.. కావాలనే ఔషధాలను దుర్వినియోగం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించకపోగా ప్రతి చిన్న రోగానికి వరంగల్ ఎంజీఎంకు రిఫరీ చేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments