యూపీఏ సర్కారును చంపేసింది ఆయనే : ఏ.రాజా

గత యూపీఏ సర్కారుకు చెడ్డ పేరు రావడానికి కారణం కాంగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ ప్రధాన కారణమని కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత ఏ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం '2జీ సెగ అన్‌ఫోల్డ్స్' అనే పుసక్త ఆవిష్కర

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (13:06 IST)
గత యూపీఏ సర్కారుకు చెడ్డ పేరు రావడానికి కారణం కాంగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ ప్రధాన కారణమని కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత ఏ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం '2జీ సెగ అన్‌ఫోల్డ్స్' అనే పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజా ఈ విమర్శలు చేశారు. 
 
"కొన్ని దుష్టశక్తులు యూపీఏ(2) ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు యత్నించాయి. అందుకోసం వినోద్‌ రాయ్‌ను కాంట్రాక్ట్‌ కిల్లర్‌లా నియమించుకున్నాయి. ఆయనను ఓ ఆయుధంగా వాడుకుని కక్ష్య సాధింపు చర్యలకు దిగాయి. ఉన్నత పదవిని అడ్డుపెట్టుకుని వినోద్‌ రాయ్‌ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దేశాన్ని, ప్రజలను దారుణంగా మోసం చేశాడు" అంటూ ఘాటైన విమర్శలు చేశారు. 
 
2010లో వినోద్‌ రాయ్‌ కాగ్‌గా ఉన్న సమయంలోనే లక్షా 76 వేల కోట్ల రూపాయల 2జీ స్కామ్‌ను వెలుగులోకి వచ్చింది. రాజా టెలికామ్‌ మంత్రిగా(2008) ఉన్న సమయంలో ఈ అవినీతి చోటుచేసుకుందని కాగ్‌ నివేదిక వెలువరించగా.. కేసు నమోదైంది. ఈ కేసులో చీటింగ్, పోర్జరీ, కుట్ర తదిర అభియోగాల కింద రాజాను 2011లో అరెస్టు చేశారు. యేడాది జైలు తర్వాత బెయిలుపై ఆయన విడుదలయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments