డీఎంకే విజయం కోసం హీరో విజయ్ రహస్య అజెండా : కె.అన్నామలై

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (11:02 IST)
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికార డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాతో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ పని చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై ఆరోపించారు. విజయ్ వర్క్ ప్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. విజయ్‌కు ఐదు పదుల వయసు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనిపించిందా? అని ఆయన ప్రశ్నించారు. 30 యేళ్ల వయసులో విజయ్ ఎక్కడున్నారంటూ ఆయన నిలదీశారు. 
 
డ్రామాలు ఆడుతున్నది బీజేపీ కాదని విజయ్ అని చెప్పారు. డీఎంకే పార్టీకి విజయ్ పార్టీ బి టీమ్ అని విమర్శించారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాలో భాగంగా విజయ్ టీవీకే పార్టీ పని చేస్తుందని అన్నారు. 
 
విజయ్ పరిధిదాటి మాట్లాడేముందు ఆలోచన చేయాలన్నారు. విజయ్‌కి చేతనైతే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని, షూటింగులు చేస్తూ ఓ లెటర్ రాసి పంపడం రాజకీయం కాదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల గురించి విజయ్‌కు ఏమి తెలుసని, ఎలాంటి అవగాహన ఉందని అన్నామలై ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments