Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత సెక్యూరిటీగార్డును కొట్టిన మధ్యప్రదేశ్ సీఎం (వీడియో)

బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (11:40 IST)
బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
దార్ జిల్లాలోని సర్దార్‌నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం సీఎం చౌహాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సెక్యూరిటి గార్డుపై చేయి చేసుకున్నాడు. 
 
కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అధికార దాహాంతో సీఎం తన సెక్యూర్టీపైనే దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన విషయంలో సీఎంను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 
 
మరోవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత వరకు స్పందించలేదు. సెక్యూర్టీ గార్డును కొట్టినందుకు, అతని విధులను అడ్డుకున్నందుకు చౌహాన్‌ను ఐపీసీ 353 కింద బుక్ చేయాలని ప్రతిపక్ష నేత అజయ్ సింగ్ డిమాండ్ ఛేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments