Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిపై నాలుగేళ్ళ చిన్నారి ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (12:13 IST)
కన్నతండ్రిపై నాలుగేళ్ళ చిన్నారి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఎందుకు చేసిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్‌ను ప్రవేశపెట్టారు. ఇంటితో పాటు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. 
 
ముఖ్యంగా, బహిరంగ మలమూత్ర విసర్జన వద్దంటూ కేంద్రం ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచారం చేస్తోంది. అలాగే, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరి అందరం పాటిస్తున్నామా? స్వచ్ఛమైన భారతదేశం కోసం మనవంతుగా మనం ఏం చేస్తున్నాం? అని ప్రశ్నంచుకుంటే మనకు మనం సమాధానం చెప్పుకునేందుకు కూడా ఆలోచించవలసిన పరిస్థితి కదా?
 
కానీ, తమిళనాడు రాష్ట్రంలోని నాలుగేళ్ళ చిన్నారి తన ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించాలని ప్రాదేయపడింది. కానీ ఆ తండ్రి చిన్నారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా ఆ చిన్నారి మాత్రం ఏమాత్రం ఊరుకోలేదు. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రిని అరెస్టు చేయాలని అందులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. 
 
ఎన్నిసార్లు చెప్పినా, ప్రాధేయపడినా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించడం లేదని, అందుకే అరెస్టు చేయాలంటూ తన ఫిర్యాదులో నాలుగేళ్ళ చిన్నారి పేర్కొంది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అవాక్కయ్యారు. 
 
ఇంతకీ తండ్రిపై ఫిర్యాదు చేసిన చిన్నారి పేరు హనీషా. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా కేంద్రంలోని వినాయక వీధిలో ఉంటుంది. ఈమె తండ్రి పేరు ఇసానుల్లా. అన్నట్లు హనీషా ఎల్కేజీ చదువుతోంది. తండ్రితో చాలాసార్లు చెప్పి విసిగిపోయిన హనీషా... చివరికి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తండ్రిపై ఫిర్యాదు చేసింది.
 
చిన్నారి హనీషా మాటలు విని విస్తుపోయిన పోలీస్ అధికారులు.. తర్వాత ఈ  విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలా అలా ఈ విషయం చివరికు వేలూరు జిల్లా కలెక్టర్ రామన్‌ చెవికి చేరింది. దీంతో ఆయన దీనిపై తక్షణ విచారణకు ఆదేశించారు. 
 
రంగంలోకి దిగిన ఆంబూరు మున్సిపాలిటీ అధికారులు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి పనులను ప్రారంభించటమేకాకుండా.. మరుగుదొడ్డి నిర్మాణానికి చొరవ చూపిన చిన్నారిని అటు పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా, మున్సిపల్ అధికారులు అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments