Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్‌యూవీ కారులో అత్యాచారం.. ఆ స్థలం సరిపోతుందా? రేప్ అందులోనే జరిగిందా?

Webdunia
సోమవారం, 10 మే 2021 (18:41 IST)
ఎస్‌యూవీ రకానికి చెందిన కారులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసేంత స్థలం ఉంటుందా? అందులో చేయడం సాధ్యమా? దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు ఆర్టీవో అధికారులను అడిగారు.
 
ఓ నేరాన్ని పరిష్కరించే క్రమంలో పోలీసులు ఇతర డిపార్ట్‌మెంట్ల సాయం తీసుకోవడం సహజమే. అలాగే ఆర్టీవో సాయం కూడా తీసుకుంటారు. కానీ, గుజరాత్ వడోదరలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆర్టీవో అధికారులు షాక్ తిన్నారు. 
 
ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ)లో రేప్ చేసేంత స్థలం ఉంటుందా అన్నది పోలీసుల ప్రశ్న. తమ కేసును పరిష్కరించడానికి ఈ సమాచారం ముఖ్యమైనదని వాళ్లు చెప్పారు. కాగా, ఇప్పటి వరకూ ఎవరూ తమను ఇలాంటి సమాచారం అడగలేదని ఆర్టీవో అధికారులు చెబుతున్నారు.
 
స్థానిక నేత, అక్రమ దందా నడిపే భవేష్ పటేల్‌పై రేప్ ఆరోపణలు వచ్చాయి. అతడు తన కారు టొయోటా ఫార్చునర్‌లో ఓ మహిళను రేప్ చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఇదే కాకుండా మరో 18 కేసులూ ఉన్నాయి. దీంతో అతన్ని ఎట్టి పరిస్థితితుల్లోనూ విడిచిపెట్టొద్దని భావించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఈ రేప్ కేసులో బలమైన ఆధారాలు సేకరించాలని సంకల్పించారు. 
 
అందులో భాగంగానే ఆ మహిళ చెప్పినట్లు ఫ్రంట్ సీటు పుష్‌బ్యాక్ చేస్తే అందులో రేప్ చేసేంత స్థలం ఉంటుందా, ఆ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ బలంగా ఉందా అన్న ప్రశ్నలు ఆర్టీవోను అడిగారు.
 
సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ గురించి ఎందుకంటే.. కారు ఆగినప్పుడు ఆ మహిళ డోరు తీసుకొని ఎందుకు పారిపోలేదు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఆధారాలు చూపించడానికి. ఈ వింత ప్రశ్నలు తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని ఆర్టీవో అధికారులు చెప్పారు.
 
అయితే తాము మ్యాథమెటికల్ రిపోర్ట్ మాత్రం ఇస్తామన్నారు. స్థలం ఎంత ఉంటుంది? సీట్లు జరిపితే ఇంకా ఎంత స్థలం ఉంటుందనే వివరాలను మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. రేప్ అందులోనే జరిగిందా లేదా అన్నది పోలీసు డిపార్ట్‌మెంట్ వాళ్లే తేల్చాలని ఆర్టీవో అధికారులు చెప్పారు.
 
ఏప్రిల్ 26 అర్ధరాత్రి సమయంలో ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసులో నిందితుడైన పాద్రా మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌ భవేశ్‌ పటేల్‌ను మే 2న అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
 
పటేల్‌ స్థానికంగా పేరున్న నాయకుడని.. అతడిపై ఇదివరకే 18 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బలమైన ఆధారాలు సంపాదించడం కోసం ఆర్టీవో అధికారులను సంప్రదించినట్లు వివరించారు. మొత్తంగా ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments