Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిక తీర్చలేదని రెచ్చిపోయిన భార్య.. భర్త ముక్కుపై ముష్టఘాతాలు... మృతి!

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (14:33 IST)
తన కోరిక తీర్చలేదని రెచ్చిపోయిన భార్య అతడి ముక్కుపై ముష్టిఘాతాలు కురిపించింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జాతీయలో వచ్చిన మీడియా కథనాల ప్రకారం.. నిఖిల్ ఖన్నా (35) అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం రేణుక అనే యువతితో వివాహమైంది. పైగా, వీరిద్దరిది ప్రేమ వివాహం. నిఖిల్ నిర్మాణం రంగంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను దుబాయ్‌లో నిర్వహించాలన భర్తను భార్య రేణుక కోరింది. దీనికి భర్త నిరాకరించాడు. 
 
పైగా, తన పెళ్లి రోజున కూడా భర్త ఖరీదైన బహుమతులు కూడా ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది.  ఈ క్రమంలో వారిద్దరి శుక్రవారం తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంత సహనం కోల్పోయిన రేణుక.. భర్త ముక్కుపై ముష్టిఘాతాలు కురిపించింది. ఆ దెబ్బలకు నిఖిల్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు దంతాలు కూడా ఊడిపోయాయి. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... రేణుకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
తిరుమల నడకదారిలో మెట్లు ఎక్కుతుండగా గుండెపోటు నిఘా డీఎస్పీ మృతి  
 
తిరుమల నడకదారిలో గుండెపోటుతో ఇంటెలిజెన్స్ మెట్లు ఎక్కువుతూ ప్రాణాలు కోల్పోయాడు. 1805వ మెట్టు వద్ద కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. మృతుడిని డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం మెట్ల దారిలో వెళుతుండగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్లదారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిలో గుండా పైకి వెళుతుండగా 1805 మెట్లు దగ్గర అస్వస్థతకు గురయ్యారు. 
 
గుండెనొప్పితో కుప్పకూలారు. డీఎస్పీ కృపాకర్ వయసు 59 సంవత్సరాలు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలోని పోరంకి పోలీసులు వెల్లడించారు కృపాకర్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments