Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరిగిపోయిన దుస్తులు.. కత్తెర సంస్కృతికి నిదర్శనం : ఉత్తరాఖండ్ సీఎం

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (09:13 IST)
అమ్మాయిలు చిరిగిపోయిన దుస్తులు ధరించడమే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. మాదక ద్రవ్యాల వినియోగంపై నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అమ్మాయిలు చినిగిపోయిన జీన్స్ ధరించడం సమాజ విచ్ఛిత్తికి దారితీస్తుందన్నారు. 
 
ఇలాంటి వస్త్రధారణతో భవిష్యత్ తరాలకు ఏం సందేశమిస్తారని ఆయన నిలదీశారు. ఇలాంటి వస్త్రధారణ మాదకద్రవ్యాల వినియోగానికి దారితీస్తుందన్నారు. చిరిగిన డెనిమ్ జీన్స్ ధరిస్తూ ఎక్స్‌పోజింగ్ చేయడం, అవి ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం నేటి తరాలు సంస్కృతిగా భావించడం దురదృష్టకరమన్నారు 
 
ఇది కేవలం కత్తెర సంస్కృతి( కైంచ్ సే సంస్కార్) మాత్రమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ విమానంలో తన పక్కన కూర్చున్న ఓ మహిళ వస్త్రధారణ గురించి ఆయన వివరిస్తూ, ఆ మహిళ బూట్లు, మోకాళ్ల వద్ద చిరిగిన జీన్స్ ధరించిందని, ఆమె చేతులకు చాలా గాజులున్నాయని చెప్పారు. ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని చెప్పారు.
 
ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జిఓ)ను నడుపుతారని అంటూ, చిరిగిన జీన్స్ ధరించి సేవ చేస్తూ ఆమె సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. అయితే రావత్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు పలువురు మహిళలు మండిపడుతున్నారు. రావత్ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ ప్రీతమ్ సింగ్ వ్యాఖ్యానించారు. మహిళలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్‌ కూడా సీఎం వ్యాఖ్యలను ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments