Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొగుడికి 40 రోజులుగా మద్యం లేదు.. పైగా ఎండలో నిల్చోలేడు.. అందుకే...

Webdunia
బుధవారం, 6 మే 2020 (10:31 IST)
పలువురు పురుషులు మద్యానికి బానిసలు కావడానికి ప్రధాన కారణంగా వారి భార్యలు లేదా కుటుంబాలే. ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది కూడా. అనేక చోట్ల భర్తలను పలు వ్యసనాలకు బానిసలు చేయడంలో భార్యల పాత్ర కీలకంగా ఉంటుంది. అలాంటి సంఘటనే ఒకటి ఇపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో 46 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 
 
దీంతో మందుబాబులు వైన్ షాపులకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే, ఆ భార్య మాత్రం తన భర్తను ఇంట్లోనే ఉండమని చెప్పి మద్యం షాపుకు వచ్చిన భర్తకు ఇష్టమైన మద్యం బ్రాండ్లను కొనుగోలు చేసుకుని వెళ్లింది. పైగా, తన భర్త ఎండలో నిల్చుని మద్యం కొనుగోలు చేయలేడనీ అందుకే తాను కొనుగోలు చేసి తీసుకెళుతున్నట్టు తనను ప్రశ్నించిన పోలీసులకు సెలవిచ్చింది. దీంతో ఖాకీలు ఖంగుతిన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ మద్యం దుకాణం తెరిచారు. దీంతో మందుబాబులంతా అక్కడకు వచ్చిన తమకిష్టమైన బ్రాండ్లను కొనుక్కుని వెళుతున్నారు. ఇలాంటి వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె దుకాణానికి చేరుకునే సమయానికి చాంతాడంత క్యూ చేరిపోయింది. అయినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కితగ్గలేదు. పురుషులతో కలిసి వరుసలో నిల్చుంది. 
 
ఆ వరుసలో గంటల కొద్దీ నిల్చున్న తర్వాత ఎట్టకేలకు ఆమె వంతు వచ్చింది. నేరుగా కౌంటర్ వద్దకు వెళ్ళి భర్తకు నచ్చిన మద్యం బ్రాండ్లను కొనుగోలు చేసి, వాటిని తన పైటకొంగుచాటు దాచిపెట్టుకుని ఇంటికి బయలుదేరింది. ఆమెను ఆసక్తిగా గమనించిన అక్కడున్న వారు ఆమెను ఆపి విషయం ఏంటని ఆరా తీశారు. 
 
ఆమె చెప్పింది విని ఎంత గొప్ప భార్యో అనుకున్నారు. తన భర్త 40 రోజులుగా మద్యం తాగలేదని, ఇంతసేపు ఎండలో నిల్చుని మద్యాన్ని కొనుగోలు చేయలేడని, అందుకే తాను వచ్చానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో అక్కడున్న పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఇలాంటి భార్యలు ఉన్నంతకాలం భర్తలు మారరని పలువురు మహిళలు కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments