నర్సు నిర్లక్ష్యం.. చేతినుంచి జారిపడిన శిశువు మృతి..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:05 IST)
లక్నోలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడే జన్మించిన శిశువు మృతి చెందింది. 
 
ఇలా నర్సు నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మృతశిశువు జన్మించాడంటూ వైద్యులు బుకాయించే యత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. చింతన్‌ ప్రాంతానికి చెందిన మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది.
 
అయితే టవల్‌తో జాగ్రత్తగా ఎత్తుకోవాల్సిన శిశువును నర్సు నిర్లక్ష్యంగా ఒంటిచేత్తో పైకి లేపింది. దీంతో శిశువు జారి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతిచెందాడు. ఇది చూసిన తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకునేందుకు యత్నించారు.
 
మృత శిశువు జన్మించిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదం కారణంగానే కిందపడి మృతిచెందినట్లు సదరు తల్లి చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం రిపోర్టులో తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు వెల్లడైంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments