ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ దళిత బాలుడిని చితకబాదిన కొందరు వ్యక్తులు ఆ తర్వాత తమ కాళ్లు నాకించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో దళిత బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తల్లి నిందితుల్లోని ఓ యువకుడి పొలాల్లో కూలీ పనులకు వెళ్లేది. గత కొన్ని రోజులుగా దినకూలీ ఇవ్వలేదు. దీంతో ఆ బాలుడు కూలీ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అంతే.. కొందరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
									
										
								
																	
	 
	ఆ బాలుడిని మొదట బెల్టుతో కొట్టారు. ఆ తర్వాత కూడా వదిలిపెట్టలేదు. కాళ్లు నాకాలని నిందితులు డిమాండ్ చేశారు. ఆ బాలుడు ఏడుస్తూ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికీ వదిలిపెట్టలేదు. ఆ సమయంలో భయపడిపోతున్న ఓ దళితబాలుడిని చూస్తూ కొందరు గట్టిగా నవ్వారు. ఇంటువంటి తప్పు మరోమారు చేస్తావా? అంటూ గద్దించారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ఈ వీడియో వైరల్ కావడంతో నిందితులు ప్లేటు మార్చారు. ఆ బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్టు ఆరోపిస్తున్నారు. వాళ్లు కొట్టే దెబ్బలు తాళలేక వారు చేసిన ఆరోపణలను ఆ బాలుడు అంగీకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన యూపీ పోలీసులు  కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు.