Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగ ధర్మరాజు... పేకాటలో భార్యను పందెం కాసిన భర్త...

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (09:34 IST)
ఆ కాలంలో రాజ్యంతో పాటు కట్టుకున్న భార్యను జూదంలో పందెం కాసి ఓడిపోయాడు ధర్మరాజు. కౌరవులతో జరిగిన జూదంలో తమ భార్య ద్రౌపదిని ఒడ్డిన పాండువులు ఓటమి పాలవుతారు. ఓడిన పాండువులు నిస్సహాయంగా చూస్తుంటే ద్రౌపదిని నిండు సభలోకి లాక్కొచ్చిన దుర్యోధనుడి సోదరుడు దుశ్శాసనుడు ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, శ్రీకృష్ణుడి సాయంతో ఆమె ఆ గండం నుంచి బయటపడుతుంది. ఆ తర్వాత అది మహాభారత యుద్ధానికి దారితీసింది. 
 
ఇపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కలియుగ ధర్మరాజు ఉన్నాడు. ఆయన పేకాటలో తన భార్యను పందెం కాశాడు. ఆ పందెంలో ఓడిపోయాడు. దీంతో అతని భార్యను అతని కళ్లముందే అత్యాచారం చేసారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్‌పూర్‌ల జరిగిన ఓ ఘటన ఈ మహాభారత ఘట్టాన్ని మరోమారు గుర్తుకు తెచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు కళ్యాణ్ పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జూదం, మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ నెల 15న తన ఇంట్లోనే స్నేహితులతో కలిసి పేకాట మొదలెట్టాడు. చేతిలోని డబ్బంతా అయిపోయింది. ఆడడానికి సొత్తు కనిపించలేదు. చుట్టూ చూస్తే భార్య కనిపించింది. వెంటన అతడి మదిలో చటుక్కున ఆలోచన మెరిసింది. వెంటనే భార్యను పందెం కాశాడు. ఆ ఆటలోనూ అతడు ఓటమి పాలయ్యాడు.
 
ఇక, స్నేహితుడి భార్యను గెలుచుకున్న మిగతా ఫ్రెండ్స్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు. స్నేహితుడి ముందే అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓడిపోయి నిస్సహాయస్థితిలో ఉన్న భర్త వారి చెర నుంచి భార్యను రక్షించుకోలేకపోయాడు. అయితే, నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం నిందితులపై చర్యలు తీసుకోలేదు. ఇది భార్యాభర్తల గొడవంటూ చేదులుదులుపుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments