Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టుతో కాసులే కాసులు... హెయిర్‌తో అమినో యాసిడ్

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (12:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జుట్టు (వెంట్రుకలు) కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకాలం బార్బర్ షాపుల్లో పోగయ్యే వెంట్రుకలకు చెత్త డబ్బాల్లో పడేశారు. కానీ, ఇకపై అలాంటి పరిస్థితి లేదు. ఆ వెంట్రుకలను కొనుగోలు చేసేందుకు సర్కారు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఒక కేజీకి రూ.40 చొప్పున పైసలు చెల్లించనున్నారు. ఈ వెంట్రుకలను ఉపయోగించి అమినో యాసిడ్స్ తయారు చేయనున్నారు. ఈ డీల్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యూపీలోని 'భారతీయ హరిత్ ఖాదీ గ్రామ ఉద్యోగ్​సంస్థాన్' (బీహెచ్‌కేజీఎస్) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. జుట్టును, ఆవు మూత్రం, పేడతో కలిపి అమైనో యాసిడ్‌ను తయారు చేస్తారని బీహెచ్ కేజీఎస్ ప్రతినిధులు చెప్పారు. దీనికోసం ఇప్పటికే ఖాదీ బోర్డు, గ్రామ ఉద్యోగ్​ మధ్య ఒప్పందం కుదిరిందని ఖాదీ గ్రామ ఉద్యోగ మినిస్టర్ సత్యదేవ్ చెప్పారు.
 
ఈ ప్రణాళికలో భాగంగా, మార్చి మొదటి వారంలో 10 పట్టణాల్లో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటుచేసి బార్బర్ల నుంచి జుట్టును కొంటామని అధికారులు చెప్పారు. అమినో యాసిడ్ తయారీకి సంబంధించి రెండు సంవత్సరాల పాటు రీసెర్చ్​చేశామని, దీన్ని తయారు చేసేందుకు జుట్టు సరైన ముడి పదార్థంగా గుర్తించాని బీహెచ్ కేజీఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామర్ విజయ్ రాయ్ అన్నారు. జుట్టుతో తయారు చేసిన అమినో యాసిడ్ ధర లీటర్​కు రూ.150గా నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 కేజీల జుట్టును వృధాగా పడేస్తున్నారనీ, ఈ పథకం ద్వారా బార్బర్లకు మరింత ఆదాయం పెరుగుతుందని నాయీ బ్రాహ్మణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments