Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం.. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారుల మృతి

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:38 IST)
యూపీలో ఘోరం జరిగింది. చాక్లెట్లు తిన్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఖుషీనగర్ జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. 
 
ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు. దీంతో చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే వారు మరణించారు. 
 
మృతులను మంజన (3), స్వీటీ (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించారు. వీరిలో మంజన, స్వీటీ, సమర్ తోబుట్టువులుగా పోలీసులు వెల్లడించారు.
 
ఇక ఇంటి ముందు దొరికిన బ్యాగులో వున్న చాక్లెట్ కవర్ల ఆధారంగా వాటిలో విష ప‌దార్ధాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments