Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ముగిసిన ఓట్ల లెక్కింపు - బీజేపీ ఖాతాలో 273 సీట్లు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (22:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 403 అసెంబ్లీ సీట్లకుగాను భారతీయ జనతా పార్టీ ఏకంగా 273 సీట్లను కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు తుది ఫలితం వచ్చేందుకు రాత్రి 9.30 గంటల సమయం పట్టింది. ఇందులో బీజేపీ ఏకంగా 273 స్థానాలను గెలుచుకుంది. 
 
అయితే, బీజేపీకి గట్టిపోటీ ఇస్తుందని భావించిన సమాజ్‌వాదీ పార్టీ 125 సీట్లతో సరిపుచ్చుకుంది. ఈ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ వాద్రా ప్రభావం అధికంగా ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ మెరుగైన స్థానాలు గెలుచుకుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. అలాగే, గతంలో యూపీని ఏలిన బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ ఇపుడు రెండు సీట్లతో సరిపెట్టుకుంది. 
 
గోవాలో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం 
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 40 సీట్లకుగాను భారతీయ జనతా పార్టీ 20 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఒక్క సీటు దూరంలోకి వచ్చి ఆగిపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం 21కు పెరిగింది. ఫలితంగా గోవాలో వరుసగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. 
 
మిగిలిన సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 12, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చెరో రెండో సీట్లను గెలుచుకున్నాయి. అయితే, బిచోలిమ్ స్థానంలో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ షెత్వే గెలిచిన వెంటనే బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఫలితంగా గోవాలో బీజేపీ ప్రభుత్వం మరోమారు రెండోసారి ఏర్పాటుకానుంది.
 
పంజాబ్ పీఠంపై ఆప్‌  
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం నుంచి చేపట్టగా సాయంత్రానికి ముగిసింది. తుది ఫలితాల్లో మొత్తం 117 సీట్లు పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే దక్కాయి. 
 
శిరోమణి అకాలీదళ్ పార్టీ 4 సీట్లతో సరిపుచ్చుకుంది. దీంతో 92 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. మొత్తంగా 59 సీట్లు దక్కించుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, ఆప్ పార్టీ ఏకంగా 92 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments